మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మే 4 : మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీలో ఎర్రగుంట గ్రామంలో గురువారం హైవే పక్కన ఉన్న దుకాణదారులందరికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్సై షాహినా సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎర్రగుంట గ్రామంలో హైవేలో నిత్యం రద్దీగా ఉంటుందని,ఎటువంటి అసంఘటిత సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే వాహనదారులు హెల్మెట్, వాహనానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.