- హామీని అమలు చేసి..
- ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
- పంచాయతీ జూనియర్ కార్యదర్శుల డిమాండ్లు న్యాయమైనవి
- దీక్షల శిభిరంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అసెంబ్లీ సాక్షిగా గ్రామపంచాయతీల జూనియర్ కార్యదర్శులను క్రమబద్దీకరిస్తానని ఇచ్చిన హామీని అమలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శులు చేపట్టిన దీక్షల శిభిరాన్ని గురువారం ఆయన సందర్శించి కమ్యూనిస్టు పార్టీ, ఏఐటియుసి పక్షాన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పేస్కేలు ప్రకటించాలని పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న డిమాండ్ న్యాయమైందని, వారం రోజులుగా రాష్ట్ర వ్యాపితంగా వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. జూనియన్ పంచాయతీ కార్యదర్శులకు సిపిఐ, ఏఐటియుసి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. నాలుగేలుగా పంచాయతీ జూనియర్ కార్యదర్శులుతో ఊడిగం చేయించుకున్న ప్రభుత్వం వారి సమస్యలను, డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు లేకుండా పరిపాలన పడకేసిందని, కార్యదర్శులను క్రమబద్దీకరించి పేస్కేల్ నిర్ణయించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరి సమ్మెను నివారించకుంటే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమ్మెను నివారించకుండా జాప్యం చేస్తూ కార్యదర్శుల ఉద్యమాన్ని సిపిఐ స్వీకరింస్తుందని స్పష్టం చేశారు.