- బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయం
- గులాబీ యువ సైన్యం సిద్ధంగా ఉండాలి
- ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ తో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
- చదువుకున్న యువత ప్రజలను చైతన్యం చేయాలి
- యువత కలలు కనాలి,దేశ రాజకీయాలలో యువకులదే కీలకపాత్ర
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్ మే 4
సమకాలిన రాజకీయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలి.దేశ,రాష్ట్ర రాజకీయా లలో యువతదే కీలక పాత్ర. యువకులు కలలు కనాలి, కలలను సాకారం చేసే విధంగా అడుగులు వేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని పద్మశాలి భవన్ నందు గురువారం నాడు పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ యువజన విస్తృతస్థాయి సమావేశానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,రాజకీయాలలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. చదువుకున్న యువత ప్రజలను చైతన్యం చేయాలని, ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.గతంలో పరిస్థితులను,ఇప్పుడున్న పరిస్థితులను ప్రజలకు సవివరంగా వివరించాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని,ఉద్యమ నాయకులు కేసిఆర్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి,సంక్షేమంలో దేశం లోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.ప్రతి ఒక్క సంక్షేమ పథకం పేద ప్రజల అభివృద్ధికి,ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించడం జరిగిందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఒక్క పథకాన్ని,పథకం యొక్క విశిష్టతను ప్రజలకు అర్థమయ్యేలా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు వారి సంక్షేమానికి అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.రైతు బంధు,రైతు బీమా 24 గంటల కరెంట్,రైతులకు ఉచిత కరెంట్,ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, గృహలక్ష్మి,దళిత బంధు, కెసిఆర్ కిట్,న్యూట్రీషియన్ కిట్,లాంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా పేద ప్రజల ఆర్థిక అభివృద్ధితోపాటు,రాష్ట్ర ఆదాయం, పెరుగుతుందన్నారు.నియోజకవర్గ అభివృద్ధికై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు,చేపడుతున్నామని తెలిపారు.జిల్లాకు మెడికల్ కాలేజీలు,డిప్లమా కాలేజి లు మంజూరు చేసామని భవిష్యత్తులో పీజీ కాలేజీ కూడా తీసుకువస్తామన్నారు. విద్యా,వైద్య ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేసేయమని తెలిపారు.మణుగూరు 100 పడకల హాస్పిటల్ కు ఇప్పటికే ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని,గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా రక్త నిధి కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.త్వరలో మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు,చేపడతామని విప్ రేగ కాంతారావు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నానని,అభివృద్ధిలో యువత కూడా భాగం కావాలని పిలుపునిచ్చారు. యువ నాయకులు క్రమశిక్షణతో ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లాలని,పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు.సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.ప్రత్యర్ధుల విమర్శలను ధీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో క్రమశిక్షణ పట్టుదలతో పని చేసిన యువకులకు రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు తమ అనుభవాన్ని యువతతో పంచుకున్నారు.వారికి పలు సూచనలు చేశారు.యువతకు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని వారు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ సైనికులలో పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రసాద్,యువజన నాయకులు, మణుగూరు పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,గద్దల రామకృష్ణ,గుండ్ల రంజిత్,గాండ్ల అశోక్,గొనెల నాని,లక్ష్మీ చైతన్య రెడ్డి,టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు రాహుల్ గౌడ్, బిఆర్ఎస్ యువజన నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.