మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 4
మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీ పరిధిలోని పద్మశాలి భవన్ నందు గురువారం నాడు తెలంగాణ ఉద్యమకారులు తూతిక ప్రకాష్ ప్రభుత్వ విప్, రేగా కాంతారావుని కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రేగా కాంతారావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులు, ఆలూ పెరగని శ్రామికులు తూతిక ప్రకాష్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా,గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసనగా సుమారు 4350 కిలోమీటర్లు,55 రోజులు,15 జిల్లాలలో,ప్రయాణం చేసి పెంచిన గ్యాస్ ధరలకు నిరసన వ్యక్తం చేస్తూ,ప్రజలను చైతన్యం చేయడం పట్ల వారు తూతిక ప్రకాష్ ను అభినందించారు.గతంలో తూతిక ప్రకాష్ సైకిల్ పై చేసిన యాత్రను అభినందించి,ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావు బైకును బహుమతిగా ఇవ్వడం జరిగిందన్నారు.ఆ బైకుపై ఇంత దూరం ప్రయాణించి,ప్రజలను చైతన్యం చేస్తూ,ఆలుపెరుగని పోరాటం చేస్తున్న తూతిక ప్రకాష్ ను ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అభినందించి,శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.