- తొలగిన దారికష్టం
- గిరిజనుల మోము లో హర్షం
- నాడుతాత్కాలికవంతెన నేడు శాశ్వతవంతెన* గతంలో
- తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ
- రేగా చొరవతో శాశ్వత వంతెన పూర్తి
మన్యం న్యూస్ గుండాల గతంలో తాత్కాలిక వంతెన పై నడిచిన గిరిజన నేడు శాశ్వత వంతెన అందుబాటులోకి రావడంతో వారి ముఖంలో ఆనందం వివరాల్లోకి వెళితే మండలం పరిధిలోని మోదుగులగూడెం గ్రామ సమీపంలో కిన్నెరసాని వాగు ప్రవహిస్తూ ఉంటుంది ప్రత్యేక వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజనులు వాగు దాటడానికి అష్ట కష్టాలు పడాల్సి కిన్నెరసాని ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో దాటుడు బండలపై కర్రలు వేసుకొని ప్రమాదం అని తెలిసిన దాటాల్సిన పరిస్థితి వారికి ఈ సమస్యను గమనించిన గుండాల పోలీస్ శాఖ కిన్నెరసాని వాగుపై తాత్కాలిక వంతెనను గుండాల పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఉన్నత అధికారుల సూచనతో అప్పటి సీఐ శ్రీనివాస్, ప్రస్తుత మణుగూరు సిఐ ముత్యం రమేష్ కృషి తో ఈ వంతెన పనిలో నిమగ్నమయి పూర్తి చేయించారు. ఎన్నో ఏళ్లుగా కిన్నెరసాని వాగుపై ప్రమాదాలు పొంచిఉన్న గిరిజనులు మాత్రం దాటాల్సి నా పరిస్థితి నెలకొనేది. దీనిని చెల్లించిన పోలీస్ శాఖ ఉన్నత అధికారులు ఎస్ ఐ ముత్యం రమేష్ కు సూచనలు చేయడంతో తక్షణమే స్పందించిన ఎస్ ఐ ఒకే రోజులోనే తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. ఏదైతేనేమి ప్రజలు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక వంతెనపై నుండి సాఫీగా రాకపోకలనుసాఫీగా సాగించారు. ప్రభుత్వ ప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ సమస్యను గమనించి ఇక్కడ వంతెనను కట్టాలని దృఢ సంకల్పంతో నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. అయినప్పటికీ సదరు కాంట్రాక్టర్ పనులను వేగవంతం చేయకుండా నాన్చట ధోరణిలో పనులు చాకించడంతో ఆగ్రహానికి గురైన రేగా కాంతారావు అధికారులతో సమీక్ష నిర్వహించి వంతెన పనులను వేగవంతం చేసి దానిని పూర్తి చేయించారు. వాగు ఇవతల ఒడ్డున ఉన్న మోదుగుల గూడెం గ్రామస్తుల భూములన్ని అవతల ఒడ్డున ఉండడంతో నిత్యం ఈ వాగు దాటి వ్యవసాయ పనుల కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటిది వంతెన పూర్తి కావడంతో గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విప్ రేగా కు రుణపడి ఉంటామంటూ పేర్కొంటున్నారు. ఈ వంతెన పూర్తి కావడం వలన సజ్జలబోడు, నడిమిగూడెం, దొంగతోగు, నాగారం, పాలగూడెం, గొడవటంచలకు ప్రజలు ఈవంతర పైనుండి వెళ్తున్నారు దీనికి తోడు రహదారి కూడా బీటీగా మారడంతో ప్రజలు ఈ దారి గుండా వెళ్లేందుకు మోగ్గు చూపుతున్నారు.