మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి మే 4: అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని మర్రిగూడెం పంచాయతీ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు గురువారం ఉపాధిహామీ కూలీలు సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు జంగిలి వెంకటరత్నం మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు లేకపోవడం వలన గ్రామ ప్రజలు అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారని,కనుక పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ కొరకు నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత నాలుగు సంవత్సరాలుగా గ్రామాలలో అన్నీ తామే అయి పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని రెగ్యులారైజేశన్ చేయాలని,విధుల్లో చేరిన గ్రామ పంచాయతి కార్యదర్సులు మూడు సంవత్సరాల కాలపరిమితిని పూర్తి చేసుకున్న అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక సంవత్సరం అదనంగా పనిచేయాలని ఆదేశించిన ఆ సంవత్సర కాలాన్ని కూడా పూర్తి చేసుకుని నాలుగు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చెయ్యాలని డిమాండ్ చేశారు.కావున జూనియర్ పంచాయతీ కార్యదర్శిలను రెగ్యులర్ చేసే వరకు మా మద్దతు ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ కూలీలు,తదితరులు పాల్గొన్నారు.