మన్యం న్యూస్, దమ్మపేట, మే, 05: దమ్మపేట మండలం, పట్వారి గూడెం గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజా శ్రేయస్సు కొరకు తెలంగాణ ప్రతి పల్లెలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి వెలుగు సెంటర్ ని దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు శుక్రవారం ప్రారంభించడం జరిగినది. ప్రతి ఒక్కరూ డాక్టర్ సలహా మేరకు పరీక్ష చేయించుకొని కళ్ళ అద్దాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, దొడ్డాకుల రాజేశ్వరరావు, కొయ్యల అచ్యుత్ రావు, చెలికాని భాస్కర రావు, జానకి రామాచారి, కూరం కమల అర్జున్, సర్పంచ్ మొగిలి అంజలి, ఉప సర్పంచ్ రెడ్డి మల్ల నాగయ్య పాల్గొన్నారు.