మన్యం న్యూస్, పినపాక :
మండలంలోని పొట్లపల్లి గ్రామానికి చెందిన సోలం నాగేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో విషయం తెలుసుకొని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు 25 వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు. భవిష్యత్తులో తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఉడుగుల సంఘం (60) సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బడే సమ్మయ్య- దివ్య వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ముక్కు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.