మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 5
మణుగూరు మండల పరిధి లోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆక్యుపేషనల్ హెల్త్ క్యాంపు సెంటర్ ను బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న శుక్రవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా సిఈ బిచ్చన్న మాట్లాడుతూ,ఉద్యోగుల సంక్షేమం కోసం టీఎస్ జెన్కో యాజమాన్యం అత్యంత ప్రాథమిక ఇస్తుందన్నారు.ఈ క్యాంపులో కేటీపీఎస్,ఓ అండ్ ఎం,ఉద్యోగులకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు.ఈ క్యాంపును ఉద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సిఈ బిచన్న కోరారు.ఈ కార్యక్రమంలో టి.శ్రీనివాస్ రావు,ఎస్ ఈ లు జే.సూర్య నారాయణ,రామ్ మోహన్,బి పార్వతి,మురళీ కృష్ణ,డిఈ రమేష్,యశోద హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు