ఇల్లందులో నూతన సినిమా చిత్రీకరణ ప్రారంభం ముఖ్యఅతిథిగా పాల్గొని క్లాప్ కొట్టిన మున్సిపల్ ఛైర్మెన్ డీవీ మన్యం న్యూస్,ఇల్లందు టౌన్: ఇల్లందు పట్టణంలోని స్థానిక అయితా ఫంక్షన్ హాల్ నందు నూతన సినిమా చిత్రీకరణ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్ఆర్కే మీడియా సంస్థ ప్రొడక్షన్ నెంబర్ వన్ వారి ఆధ్వర్యంలో అయిత ఫంక్షన్ హాల్ నందు నూతన సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా బాగా తీసి ఇల్లందుకి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ, కొరియోగ్రాఫర్స్ పొదిల శ్యామ్, ప్రవీణ్, సినిమా యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
