మన్యం న్యూస్, దుమ్మగూడెం :
దుమ్ముగూడెం మండల పరిధిలోని ముల్కనపల్లి గ్రామంలో సుమారు 200 మంది కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ లో చేరారు. శనివారం దుమ్ముగూడెం మండల పరిధిలోని ముల్కనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య ఆ గ్రామ సమస్యలపై ప్రజలతో చర్చించారు. తన దృష్టి వచ్చిన సమస్యలను వెంటనే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మన గిరిజన తెగలు సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులకు , సిఎల్పీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మూల్కనపల్లి గ్రామస్తులు 200 మందికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాస్ రావు, టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, సర్పంచ్ సోడి చలపతి, దర్శి సంభశివారావు, దేవా, శివ, సాల్మన్, కొండ్రు దుర్గారావు, సోడి సందేశ్వరరావు, సున్నం భద్రరాజు, సున్నం భీమయ్య, ఇర్ప తిరుపతిరావు, కొండ్రు రాంబాబు, తుర్రం నరేష్, కొండ్రు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.