మన్యం న్యూస్, పినపాక:
మండలంలోని జానంపేట గ్రామంలో రైతు వేదిక నందు ఎస్కే సర్వర్ పాషా, షేక్ హసీనా,లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన లక్ష ఇరవై వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం కోసం కృషి చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాసరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.