UPDATES  

 క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : జిల్లా ఎస్పీ వినీత్.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : జిల్లా ఎస్పీ వినీత్.

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురం నందు ఘనంగా ప్రారంభమైన డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం పరిధిలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురం నందు డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్. సతీసమేతంగా పాల్గొన్నారు.గౌరవ అతిధిగా ఇండియన్ నేషనల్ వాలీబాల్ మాజీ ఆటగాడు పాలడుగు వెంకటేశ్వరరావు పాల్గోన్నారు. ముందుగా ఎనిమిది ప్లాటూన్స్ తో స్పోర్ట్స్ కమాండర్ ఆర్ఐ దామోదర్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ పెరేడ్ ను నిర్వహించారు.ముందుగా గౌరవ అతిథి మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఒత్తిడితో విధులు నిర్వర్తించే పోలీసులకు జిల్లా ఎస్పీ స్పోర్ట్స్ మీటిని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.నిత్యం మనిషి జీవితంలో క్రీడలు ఒక భాగంగా ఉండాలని అన్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని,ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో నిత్యం సాధన చేస్తూ ఉండడం వలన దైనందిన కార్యక్రమాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనవచ్చని అన్నారు.జిల్లాలో మొదటిసారిగా ఈ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఘనంగా ఈ ఏర్పాట్లను చేసిన ఆర్మడ్ రిజర్వు అధికారులను అభినందించారు.అనంతరం స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా పావురాలను,బెలూన్లను గాలిలోకి వదిలారు.పోలీసు అధికారులు, సిబ్బందికి మూడు రోజులపాటు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్లో 100 మీటర్ల పరుగు పందెం,200 మీటర్ల పరుగు పందెం,4×100 రిలే,వాలీ బాల్,టగ్ ఆఫ్ వార్,డిస్కస్ త్రో,షాట్ ఫుట్,షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది.జిల్లాలోని ఐదు పోలీస్ సబ్ డివిజన్ల నుండి పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ స్పోర్ట్స్ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ ఐపిఎస్, డీఎస్పీలు రెహమాన్,రమణ మూర్తి,రాఘవేంద్రరావు మరియు జిల్లాలో పని చేసే పోలీసు అధికారులు,సిబ్బంది, పాల్గోన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !