మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశమైన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ రేగా కాళికా మాట్లాడుతూ ఈనెల 10వ తారీఖున కరకగూడెం గ్రామంలో గిరిజనుల వేసవికాలం ప్రధాన పంట అయిన తునికాకు సేకరణకు సంబంధించి గత ఏడాది తునికాకు బోనస్ కింద మంజూరైన రూ 30 కోట్ల విలువగల చెక్కులను పంపిణీ చేయడానికి అటవీశాఖ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల.ఇంద్రకరణ రెడ్డి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా. కాంతారావు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల వేసవి కాలంలో సేకరించే ప్రధాన ఆదాయ పంట అయిన తునికాకు సేకరణకు సంబంధించి గత సంవత్సరం తునికకు బోనస్ పినపాక నియోజకవర్గనికి రూ.30 కోట్ల రూపాయలను మంజూరు చేయించిన అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కెసిఅర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, అటవీ,పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి నియోజకవర్గం ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు, ఆత్మ కమిటి డైరెక్టర్ కొంపెల్లి పెదరామలింగం,సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ, ఎలిపెద్ది శ్రీనువాస రెడ్డి,రావుల.కనకయ్య,రావుల.రవి,మల్కం.వెంకటేశ్వర్లు, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం.నరసింహారావు, చిట్టిమల్ల.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
