ములుగు జిల్లా కమిటీ సభ్యుడు పాస్టర్ పైడిపల్లి ఎల్లేష్ గౌడ్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
క్రిస్టియన్ ఎమ్మెల్సీగా గోనె సాల్మన్ రాజుకి అవకాశం కల్పించాలని తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్ అసోసియేషన్ ములుగు జిల్లా కమిటీ సభ్యులు పాస్టర్ పైడిపల్లి ఎల్లేష్ గౌడ్ కోరారు.
ప్రస్తుతం క్రిస్టియన్ నామిటెడేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సాల్మన్ రాజ్ పదవి కాలం ముగిసిందని,దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన గోనె సాల్మన్ రాజుకు ఎమ్మెల్సీగా ఈసారి అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పాస్టర్ ఎల్లేష్ గౌడ్ కోరారు.క్రిస్టియన్ సోదరులకు సహకరిస్తున్న సాల్మన్ రాజును ఎమ్మెల్సీ పదవికి నామినేటెడ్ చేస్తే, రాష్ట్రంలోని క్రిస్టియన్లకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.ఇప్పటికే 33 జిల్లాలలోని క్రైస్తవులలో ఐక్యతను తెచ్చి క్రైస్తవ సమస్యల పరిష్కారం దిశగా సాల్మన్ రాజ్ కృషి చేస్తున్నారని ఎల్లేష్ అన్నారు. ములుగు నియోజకవర్గ క్రిస్టియన్ సోదరులందరూ వచ్చే ఎన్నికలలో క్రిస్టియన్ కుటుంబాల శ్రేయస్సు కోరే వారికే తమ పూర్తి మద్దతు తెలుపుతారని పాస్టర్ ఎల్లేష్ గౌడ్ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోనె సాల్మన్ రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పత్రిక ముఖంగా కోరారు
