నత్తలే నయం..
*ఏండ్లు గడుస్తున్న నిర్మాణం పనులలో వేగం పెరగదు
ఈ విద్యా సంవత్సరానికి కూడా బిల్డింగ్ అందుబాటులోకి వచ్చేనా..?
ఆళ్లపల్లి కస్తూరిబా పాఠశాల భవనంపై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం
మన్యం న్యూస్ గుండాల: ఆగదు పని ముందుకు సాగదు అన్న రీతిలో ఆళ్లపల్లి మండలంలో నిర్మిస్తున్న కస్తూరిబా పాఠశాల భవనం పరిస్థితి. ఏండ్లు గడుస్తున్న నిర్మాణంలో వేగం పెరగకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి ఒక్కరు ఇద్దరు మేస్త్రీలతో సదరు గుత్తేదారు పని చేయించడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సొంతంగా పనులు సాగుతున్నాయి. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని ఆళ్లపల్లి మండలానికి కస్తూరిబాయి భవనం కోసం 3 కోట్ల 30 లక్షల నిధులను మంజూరు చేశారు 2021 వ సంవత్సరంలో పనులను ప్రారంభించినప్పటికీ పూర్తికాక పోగా ఇంకా సంవత్సరం గడిచిన పూర్తయ్యేలా కనబడటం లేదు. పనులలో మాత్రం వేగం పెరగకపోవడంతో ఈ సంవత్సరానికైనా పూర్తవుతుందా అన్న భావనలో ప్రజలు ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణితోనే పనులు ముందుకు సాగటం లేదని మండల ప్రజలు తమ మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు అన్న రీతిలో పనులు సాగుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే కృషితో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరితో పనులలో వేగం పెరగటం లేదని ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఈ భవనం గత నవంబర్ నెలలోనే ప్రభుత్వానికి అప్పజెప్పాల్సింది ఉండగా పూర్తి కాకపోవడంతో మరో ఐదు నెలలు సమయం పొడిగించిన ఆ సమయం గత ఏప్రిల్ తోనే గడువు పూర్తయిన పనులలో మాత్రం వేగం పెరగలే కాంట్రాక్టర్ ఇచ్చిన సమయం పెంచుకుంటూ పోతున్నారే తప్ప పనులను పూర్తిచేసే నాధుడే లేడన్నట్టు సాగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పనులపై సమీక్ష నిర్వహించి భవనం త్వరగా పూర్తయ్యే విధంగా చొరచూపాలని ప్రజలు విన్నవించుకుంటున్నారు.
మరో రెండు నెలలలో పూర్తి చేస్తాం ఏఈ సురేష్: మరో రెండు నెలలలో పనులను పూర్తి చేస్తామని ఈ డబ్ల్యూఐ డిసి ఏఈ సురేష్ పేర్కొన్నారు గత నవంబర్ తోనే సమయం అయిపోయిన కాంట్రాక్టర్ మరో ఐదు నెలలు సమయం కావాలని కోరడంతో సమయం పెంచి ఇవ్వవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు త్వరగా పనులు అయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు
