UPDATES  

 కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే నిరుద్యోగ సభను విజయవంతం చేయండి: ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ ..మే 8 సోమవారం హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో జరిగే కాంగ్రెస్ నిరుద్యోగ సభను విజయవంతం చేయాలని ఇల్లందు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రవి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఇందిరమ్మ రాజ్యాస్థాపన జరగాలని దృడ సంకల్పంతో ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో భాగంగా నిన్నటితో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వరకు ఆరువందల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక కొత్తబస్టాండ్లోని రాజీవ్ భవన్లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ… కేంద్రంలో మోడీ బిజెపి ప్రభుత్వం ఏర్పడితే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గత తొమ్మిది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిందని, అదేవిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడినాక తెరాస పరిపాలనలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేవలం 30 వేల ఉద్యోగాలను అది కూడా పోలీస్ ఉద్యోగాలను మాత్రమే రిక్రూట్ చేసారని తెలిపారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన ప్రజాస్వామ్య వాదులపైన, విద్యార్థుల పైన, నిరుద్యోగులపైన కార్మికులపైన, కర్షకులపైన ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికై ఈ నెల ఎనిమిదిన భారీ నిరుద్యోగ సభకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ నిరుద్యోగసభకు ఇల్లందు నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు, నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కర్షకులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డాక్టర్ రవి కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణాల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ ధరావత్ కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బీఎన్ గోపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసిక తిరుమల్, పట్టణ కాంగ్రెస్ మహిళా నాయకురాలు జ్యోతి, రవి, ఇల్లందు నియోజకవర్గ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ అరవింద స్వామి, ఇల్లందు పట్టణ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాషా, సాయి తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !