వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
*ఏటూరు నాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉన్న సిహెచ్‌సి ప్రాంగణంలో నిర్మాణo పూర్తయిన టి-హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను పరిశీలించి, డయాగ్నస్టిక్ సెంటర్‌కు శనివారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ సందర్శించారు.పరికరాలు హెచ్‌ఆర్ సిబ్బందిని మంజూరు చేయడంపై సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు రెండు పరికరాలు అందాయని, ఇతర పరికరాలు హెచ్‌ఆర్ సిబ్బందిని నియమించడంపై జిల్లా వైద్య అధికారితో మాట్లాడతానని సూపరిం టెండెంట్ నివేదించారు.
వైద్యుల హాజరు రిజిష్టర్‌ను పరిశీలించి సీహెచ్‌సీలో గైనకాలజీసేవలు,ఎంతమందిగైనకాలజిస్టులు,అనస్తాసియా వైద్యులు అందుబాటులో ఉన్నారంటూ సూపరింటెం డెంట్ ను అడిగి తెలుసు కున్నారు.మొత్తం నలుగురిలో ఒక గైనకాలజిస్ట్‌ని ములుగు ఏరియా ఆస్పత్రికి,ఇద్దరు వైద్యులు ఓపీ,ఓటీలో ఉన్నారని,మరో వైద్యుడు ప్రసూతి సెలవులో ఉన్నారని సూపరింటెండెంట్ నివేదించారు.ఎంసీహెచ్ భవనంలో డయాలసిస్ సేవలు,రోగుల చికిత్స,వైద్యుల లభ్యత తదితరాలపై ఆరా తీశారు.జనరల్ గైనకాలజీ వార్డులు, పోస్ట్ ఆపరేషన్ వార్డులు సాధారణ వార్డులను తనిఖీ చేశారు.వార్డులలో నివేదించే కేసులు,డెంగ్యూ,
మలేరియా కేసులు ఏవైనా ఉన్నాయని సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు.
రోగులతో మాట్లాడుతూ.స్థానిక ప్రదేశాలు,ఏవైనా సమస్యలు ఉన్నాయ,వైద్యులు అందించే చికిత్స మొదలైన వాటిపై ఆరా తీశారు.అందుబాటులో ఉన్న గైనకాలజిస్టులు మరియు అనస్టిషియా వైద్యులతో సిహెచ్‌సిలో 24 గంటల గైనకాలజీ సేవలను ప్రారంభించాలని మరియు రాత్రి వేళల్లో కూడా తగినంత మంది సిబ్బందితో సాధారణ చికిత్సను మెరుగుపరచాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ సి సూపరిండెంట్ డాక్టర్ సురేష్ కుమార్,డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.