మన్యం న్యూస్ గుండాల: తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ ను బహిష్కరించే హక్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి లేదని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ నిర్మాణం లేకుండా ఒకే ఒక్కడు జాతీయ కన్వీనర్ అయిన రమణాల లక్ష్మయ్య ను బహిష్కరిస్తున్నట్టు పత్రిక పర్కటన విడుదల చేశారని అన్నారు ఆ ప్రకటనను రాష్ట్ర కమిటీ పూర్తిగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఒకే ఒక్క వ్యక్తి బహిష్కరించే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు ఏమైనా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే రాష్ట్ర కమిటీ చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉండవని అన్నారు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఐదుగురు ఆదివాసి సభ్యులతో తుడుం దెబ్బ జాతీయ కమిటీ నిర్మాణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జాతీయ కమిటీ తీసుకునే నిర్ణయాలకు ఒక రమణాల లక్ష్మయ్య అనే బాధ్యుడిని చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఎలాంటి నిర్ణయాలైన కమిటీ లోనీ అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నాకే పత్రికా ప్రకటనలు విడుదల చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వట్టం కన్నయ్య, బాలకృష్ణ, రామారావు, వీరభద్రం, కిషన్ రావు, కల్తి మల్లయ్య సాంబయ్య, మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతా వెంకటేశ్వర్లు, మహేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
