UPDATES  

 అమ్మో రెవెన్యూ లీలలు

అమ్మో రెవెన్యూ లీలలు
సినిమా ప్లాన్లకు ఏమాత్రం తీసి పోని మండల రెవెన్యూ పెద్ద స్థాయి అధికారి పనులు
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
ఎంతోకాలంగా రాంపులలో రవాణా సౌల భ్యం కోసం రోడ్డుపనుల నిమిత్తం జరుగుతున్న గ్రావెల్
తో లకాలలో ఎటువంటి చర్య తీసుకోని రెవెన్యూ పెద్దసాయి అధికారి . ఇటీవల దశరాజపల్లిలో ఒకటి రెండు మట్టి ట్రిప్పులు ఇళ్ల నిర్మాణ నిమిత్తం తోలుకునే వారిపై జులుం విధించారు. వివరాల్లోకి వెళితే. బర్లగూడెం గ్రామం దసరాజపల్లి లో ఇటీవల మట్టి తోలకాలు చేపడుతున్న జెసిబి వాటితో ఉన్న ట్రాక్టర్ల పై వీఆర్ఏలు విరుచుకు పడ్డారు . మడకం లింగయ్య అనే వ్యక్తి ట్రాక్టర్ని సిజ్ చేయడమే కాకుండా ట్రాక్టర్ డ్రైవర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని. ట్రాక్టర్ డ్రైవర్ల మీద దాడులు చేసినట్టు గా సీజ్ చేయబడిన ట్రాక్టర్ డ్రైవర్ తెలిపాడు. ఇదిలా ఉండగా ఈ విషయం పట్ల రెవెన్యూ సిబ్బంది వీరి మీద వేరే నాటకానికి దారి తీశారు అని. తెలిపాడు.
అసలే రెవెన్యూ సిబ్బంది మీద అక్రమగ్రావల్ తోలకాల విషయమై వస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పలేక సతమతమవుతున్న తరుణంలో ఎవరినో ఒకరిని పట్టుకొని వీటన్నిటికీ స్వస్తి పలికే విధంగా ప్లాన్ వేసుకుని ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు జెసిబిను వదిలేసి పేద గిరిజనుల ట్రాక్టర్ల మీద పడ్డారు. అంతేకాకుండా వీరి మీద వచ్చే అభియోగాలని కప్పిపుచ్చేందుకు ఇదే మంచి తరుణం అని భావించి లేనిపోని నిందలు అమాయక గిరిజనులు పై వేశారు. అంతేకాకుండా జెసిబిబండి పోయేదాకా వీఆర్ఏలు నిద్ర నటిస్తుండి . బండిని పంపించాక బండి ఓనర్ మీద ఫిర్యాదు చేసిన వైనం కనబడుతుంది. ఇదంతా జెసిబి ని వదిలేసారు అని ఎవరైనా అడుగుతారేమో అని రివర్స్ గా బండి ఓనర్ మీద ఫిర్యాదు చేసి అందరికీ రూల్ ఒకటే సమానమే అనే విధంగా ఆ పరిసరాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు అని ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా మండల రెవెన్యూ అధికారి రాసిన ఫిర్యాదులొ వీఆర్ఏలపై ట్రాక్టర్లు దాడి చేశారని రాసిన మాటలు పూర్తిగా అవాస్తమని టాక్టర్ డ్రైవర్లు సంబంధించిన మిగతా గ్రామ ఆదివాసీలు తెలిపారు. ఉంటే అందరికీ ఒకటే న్యాయం ఉండాలని పేదలని ధనవంతులను చూడకుండా న్యాయం అందరికీ న్యాయంగానే ఉండాలని అక్కడున్న ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీఆర్ఏలు పంపించిన ఆ జెసిబి ని కూడా తీసుకువచ్చి సీజ్ చేయాలని. వారు కోరారు. అంతేకాకుండా స్టేషన్ లో వచ్చిన ఫిర్యాదులు ట్రాక్టర్ డ్రైవర్లు వీఆర్ఏలపై చంపడానికి రాలేదని తమపై నే దాడులు వీఆర్ఏ లు చేశారని . లేనిపోనివి అభియోగాలు తమ మీద వేస్తే ఆదివాసి సంఘాలన్నీ వస్తాయని వారిని ఆశ్రయించే విధంగా రెవెన్యూ అధికారులు చేయొద్దని ట్రాక్టర్ డ్రైవర్లు కోరారు.
నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాంపులలో జరిగే అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని, రాంపులో కో న్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయాలను ఎందుకు అ పడం లేదని ఈ విషయం తెలుసుకున్న. మండల ప్రజలు రెవెన్యూ యంత్రాంగంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత తహాసిల్దార్ ను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా వివరణ ఇచ్చేందుకు అధికారి ససేమీరా అనడం గమనార్హం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !