మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 06: అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన గొల్లపల్లి నరసింహరావు మద్రాస్ ఐఐటి నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్‌డి పూర్తి చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ థీసిస్ సమర్పించడానికి సహకరించిన అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల గ్రామం నుంచి ఈ విధంగా ఎదిగి రావటం, తన తల్లిదండ్రుల ఆశీస్సులు తన అన్నయ్య గొల్లపల్లి వెంకన్నబాబు(వెంకీ) ప్రోత్సాహలేనని ఆయన అన్నారు
