మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం నాడు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించి, పలువురిని పరామర్శించారు. ఉప్పాక గ్రామంలో రూ.14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించి, గ్రామంలోని వారందరూ ఈ ఆసుపత్రిని ఉపయోగించుకోవాలని అన్నారు. అదే గ్రామానికి చెందిన కళ్యాణం మల్లికార్జున్, మార్త ఇస్తారి అనే వ్యక్తులు కొన్ని రోజుల క్రితం మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించి మిఠాయిలు పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడి, కోలుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఏడూళ్ళ బయ్యారం గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ సనప భరత్ ను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన బుహ్యవరపు శ్రీనివాసరావు (50) మరణించడంతో, ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. అనంతరం జానంపేట గ్రామానికి చెందిన ముల్లపూడి సత్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడి విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకొని వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమాలలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.