UPDATES  

 వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

  • వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
  • రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
  • సీసీ ఎక్స్ స్టేక్ హోల్డర్స్ రైతుల సమావేశంలో పాల్గొన్న రేగా

మన్యం న్యూస్, పినపాక:

మండలంలోని జానంపేట గ్రామంలో గల రైతు వేదిక నందు సీసీ ఎక్స్ స్టేక్ హోల్డర్స్ రైతుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షుడు  రేగా కాంతారావు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి  అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్  రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, ఒకే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు, రైతుల సంక్షేమం గురించి రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్  అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిన్పాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి, దాట్ల వాసు బాబు, ఏడిఏ తాతారావు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !