నిరుద్యోగ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి -సున్నం నాగమణి
మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 06: అశ్వారావుపేట మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మ రాంబాబు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ మెంబర్, ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి హాజరైయ్యారు. ఈ సమావేశం ఉద్దేశించి సున్నం నాగమణి మాట్లాడుతూ హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో ఈనెల ఎనిమిదినా సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే నిరుద్యోగ సభ విజయవంతం చేయాలని సున్నం నాగమణి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభిమాలను కోరారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ నిరుద్యోగ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అమలు చేయడంలో పూర్తి విఫలమయ్యరన్నారు. ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రశ్నాపత్రాలు లీకేజీలు అరికట్టలేక పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ అధ్యక్షుడు ఉప్పల రాజశేఖర్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం శిరీష, కొప్పుల శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు