మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 06
మణుగూరు మండలం వార్త దినపత్రిక పాత్రికేయులు పిండిగ వెంకట్ సతీమణి వరలక్ష్మి గత కొంతకాలం నుంచి అనారోగ్యం తో బాధపడుతూ గురువారం రాత్రి మరణించడంతో విషయం తెలుసుకొన్న పినపాక నియోజకవర్గం ఎస్సి సెల్ నాయకులు శనివారం ముత్యాలమ్మ నగర్ లోని వారి నివాసానికి వెళ్లి పిండిగ. వరలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి వెంట పినపాక నియోజకవర్గం ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న.అశోక్ కుమార్, సీనియర్ నాయకులు తడికమల్ల ప్రభుదాస్, మణుగూరు మండలం ఎస్సి సెల్ అధ్యక్షులు గంగారపు రమేష్,ప్రధాన కార్యదర్శి కట్ట రాజకుమార్,మణుగూరు టౌన్ ఎస్సి సెల్ అధ్యక్షులు సంజీవరావు,అశ్వాపురం మండలం ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి వల్లెపోగు రాము, భూమయ్య,డేగల సంపత్, రామకృష్ణ,గోపి,వెంకన్న,రవీందర్,వావిలాల నర్సయ్య తదితరులు ఉన్నారు