- ఆటోను ఢీ కొన్న కారు
- నలుగురి పరిస్థితి విషమం
- మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని 4 ఇంక్లైన్ జాతీయరహదారిపై ఆటోను ఢీ కొట్టిన కారు సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి విజయవాడ నుంచి హైవే రోడ్డుపై భద్రాచలం వైపు వెళ్ళుచున్న టీఎస్27 ఎఫ్ 4066 నెంబర్ గల కారు అతివేగముగా వస్తున్న క్రమంలో 4 ఇంక్లైన్ బస్టాండ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న టీఎస్28 టి ఏ9972 నెంబర్ గల ఆటోను డి కొట్టడంతో ఆటో హైవేపై పల్టీ కొట్టగా అందులో ఉన్న ప్యాసింజర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. క్షతగాత్రులను వైద్యులు పరీక్షించగా ఐదుగురిలో నలుగురికి కాళ్లు చేతులు విరగటంతో పాటు తలకి, ఛాతిలో బలమైన గాయాలు అవటంతో పాటు, నలుగురి
పరిస్థితి విషమించటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు తరలించారని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నామన్నారు