UPDATES  

 ప్రారంభం అయినా శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 07: మండల పరిదిలోని, కొత్త నారావారిగూడెం గ్రామంలో ఆదివాసీ నాయకపోడు గిరిజనులు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర ఆదివారం ప్రారంభం అయింది. ఆదివారం సాయంత్రం గ్రామ పొలిమేర నుంచి స్వామి వారి ఊరేగింపు ప్రారంభం అయింది. సన్నాయి, మంగళ వాయిద్యాలు, డోలు చప్పుళ్ళు, గణాచారలు నృత్యాలు, కుర్రకారు కేరంతల ఉత్సాహాల నడుము గ్రామాల్లో ప్రతి వీధి కి ప్రతి ఇంటికి స్వామి వారిని తీసుకెళ్లారు. ఊరేగింపు అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆలయం లో స్వామి వారిని వారిని ఉంచారు. ఈ సందర్బంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు స్వామి వారికి సేవ కార్యక్రమం జరుగుతుందని, అదే విదంగా కొలబియ్యం, సూర్య పట్నం చంద్ర పట్నం, సరువులు, కొండాలు, గంధపళ్ళు కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కాబట్టి కులమతాలు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొనవచ్చు అని వారు అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !