UPDATES  

 విఓఏల న్యాయమైన డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి -తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 07

మణుగూరు మండల లోని మండల పరిషత్ కార్యాలయం దగ్గర తమ న్యాయమైన డిమాండ్స్ కోసం ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ విఓఏలు,గత 21 రోజులుగా చేస్తున్న ధర్నా శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మణుగూరు మండల కమిటీ నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం సందర్శించారు.ఈ సందర్భంగా సంఘం తరపున విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ కు సంఘీభావం తెలియజేశారు.వారి న్యాయమైన కోరికల సాధనకు వారు మద్దతు తెలియచేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బానోతు రాము,మండల అధ్యక్షులు షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ, విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ యొక్క న్యాయమైన డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని,కనీస వేతనం, సేర్ప్ ఉద్యోగుల లాగా గుర్తించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ సందర్భంగా విఓఏలు తమకు మద్దతు తెలిపిన టిఏస్ యూటిఎఫ్ సంఘానికి విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ కార్యక్రమం లో టీఏస్ యూటీఎఫ్, నాయకులు కుమార స్వామి, రత్న ప్రసాద్,విఓఏల మణుగూరు మండల అధ్యక్షురాలు కణితి సులోచన, జిల్లా కార్యదర్శి గోపాల్, సభ్యులు రామనర్శయ్య,షేక్ జరీనా బేగం,లలిత,భారతి, నాఫిజా,పద్మ,వెంకట లక్ష్మీ, పద్మ,సీత,అరుణ,హ్యాండ్ రైటింగ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !