మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 07
మణుగూరు పట్టణంలోని పాత మణుగూరు కు చెందిన బిఅర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు కూరం శ్రీను కుమార్తె ఓణీల అలంకరణ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్,సీనియర్ నాయకులు వట్టం రాంబాబు,యాదగిరి గౌడ్,కృష్ణ,తాతా రమణ, యువజన నాయకులు రవి ప్రసాద్,గుర్రం సుజన్,బానోతు రమేష్,సోషల్ మీడియా అధ్యక్షులు సందీప్ రెడ్డి,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.