మన్యం న్యూస్ మణుగూరు టౌన్ :మే 7
మణుగూరు కు కొల్హాపూర్ రైలు సేవలు పునరుద్ధరణ పై మణుగూరు జడ్పిటిసి పోశం. నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు.మండల ప్రజల తరఫున ఎంపీ మాలోత్ కవితకు,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కరోనా సమయంలో మణుగూరు నుండి కొల్హాపూర్ రైలు సేవలు రద్దు చేసిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు అన్నారు.ఎంపీ కవిత ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో,రైల్వే అధికారుల తో మాట్లాడి మణుగూరు ప్రాంతానికి కొల్హాపూర్ రైలు తీసుకురావడం జరిగింది అన్నారు.పారిశ్రామిక ప్రాంతమైన పినపాక నియోజకవర్గం లోని బీటీపీఎస్,సింగరేణి,హెవీ వాటర్ ప్లాంట్,బిపిఎల్ ఉద్యోగులకు,స్థానిక ప్రజలకు ఈ రైలు సేవలు చాలా ఉపయోగపడతాయి అన్నారు. రైలు కోసం ప్రత్యేకంగా పలు మార్లు విజ్ఞప్తి చేసిన ఎంపీ కవితకు,ప్రభుత్వ విప్,రేగా కాంతారావుకు పినపాక నియోజకవర్గ ప్రజల తరపున జెడ్పీటీసీ ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు.కొత్తగూడెం నుంచి మణుగూరుకు సింగరేణి రైలును,విజయవాడ కొత్తగూడెం రైలును మణుగూరు దాకా పొడిగించాలని దానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని, మణుగూరుకు తీసుకువస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు ఆర్ వెంకట్ రెడ్డి, కూనవరం సర్పంచ్ ఏనిక. ప్రసాద్,యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,కటకం గణేష్, రమాదేవి పాల్గొన్నారు