మన్యం న్యూస్, మంగపేట.
మాలల ఐక్యత సాధికారత కోసం తెలంగాణ మాల మహానాడు వ్యవస్థపాకులు అద్దంకి దయాకర్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మంగపేట మండలం అంబెడ్కర్ భవన్లో
తెలంగాణ మాల మహానాడు మంగపేట మండల కార్యవర్గ సమావేశం మాలమహానాడు మంగపేట మండల అధ్యక్షులు మంచాల నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగేర్ల రాజరత్నం వచ్చారు. సమావేశాన్నిఉద్దేశించి కర్రీ శ్యాంబాబు మాట్లాడుతు ప్రాచీన భారతదేశంలో మాలకులం ఓ బలమైన కులంగా తన ఉనికిని చాటుకుంది. వీరిని చూసి కొన్ని కులాలు భయపడేవి కట్టుబాట్లు అంటే ప్రాణమిచ్చే ఒక కులం మల్ల యోధుల సంతతికి చెందిన ఒక కులం బలమైన వ్యవస్థకు మూల స్థంభంగా నిలబడిన మాల కులం ఇలాంటి కులంలో పుట్టినందుకు గౌరవంగా ఉంది,మనలో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా అందరు ఐకమత్యంగా ఉండిఎదుర్కోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మంచాల నాగేంద్ర కుమార్ జిల్లా అధ్యక్షులు శ్యాంబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగెర్ల రాజరత్నం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పల్లె నాగరాజ్, భాను, ఎడ్ల నరేష్, జానపట్ల విష్ణు,చిట్టి మల్ల బాలు, గోడ ప్రవీణ్,రాము, బోడ నవీన్, బోడ శ్రీను, ఉగ్గుమల్ల గణేష్, నాగేల్లి పరుశరామ్, బూర్గుల ప్రవీణ్, ఎడ్ల నవీన్, మద్దెల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.