మన్యం న్యూస్,ఇల్లందు:బహుజన రాజ్యాధికారం కొరకు బీఎస్పీ అధ్వర్యంలో హైదరాబాదులోని సరూర్ నగర్లో విద్యార్థి అమరుల ప్రాంగణంలో నిర్వహించతలపెట్టిన తెలంగాణ భరోసా సభకు బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జ్ బాదావత్ ప్రతాప్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ లో గల పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా నేతలు బయలుదేరారు. ఈ సందర్భంగా బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ… సామాజిక పరివర్తన, దొరలపాలన నుంచి విముక్తి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు బీఎస్పీ చేపట్టిన తెలంగాణ భరోసా సభ ద్వారా ప్రజలకు బీఎస్పీ సిద్ధాంతాలను తెలియజేయటంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు లేతాకుల కాంతారావు, బాదావత్ రాంబాబు, కాంపాటి నరేష్, కాంపాటి కిరణ్, లాజర్, సుందర్, కొడెం ప్రవీణ్, అశోక్, విష్ణు, సాయి, తేజ, సువార్త, అశ్విని, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు.
