UPDATES  

 చలించిన మానవత్వం, వృద్ధిరాలికి సహాయం అందించిన విఓఏ

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 07: సహాయం చేయాలంటే చేతులు రాని రోజుల్లో ఇబ్బందిలో ఉన్న వారు కోరిన సాయం అందించడం కోసం తాపత్రయపడేవారు ఉన్నారంటే గొప్ప విషయమే. అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన వివోఏ మామిడి వెంకటమహాలక్ష్మి వృద్ధురాలి పట్ల మానవత్వం చూపారు. ఆదివారం అశ్వారావుపేట లోని ఓ వేడుకకు వెళుతుండగా ఊట్లపల్లి సమీపంలో రోడ్డుపై మండుటెండలో నడవలేని స్థితిలో చేతులు ఆధారంగా పాకుతూ వెళ్తున్న వృద్ధురాలిని చూసిన వెంకటమహాలక్ష్మి చలించిపోయింది. దీంతో ఆ వృద్ధురాలికి కొంత నగదుని ఇచ్చేందుకు ప్రయత్నించగా అందుకు ఆమె నిరాకరించింది. తనకి ఆకలి వేస్తూ దాహంగా ఉందని వృద్ధురాలు చెప్పడంతో సుమారు ఒక కిలోమీటర్ వెళ్లి టిఫిన్, వాటర్ బాటిల్ కొనుగోలు చేసుకుని వచ్చి వృద్ధురాలికి అందించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !