మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం హైదరాబాద్ రానున్నారనీ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో యువతతో కలిసి పాల్గొంటారని టీపీసీసీ టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు స్పష్టం చేశారు. ఆదివారం చుంచుపల్లిమండలం విద్యానగర్ కాలనీలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని రేపు సాయంత్రం 4 గంటల కు హైదరాబాద్‌కు ప్రియాంక చేరుకుంటారని అక్కడి నుంచి బయల్దేరి ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళి అర్పిస్తారని చెప్పారు. అక్కడి నుంచి కాలినడకన ర్యాలీగా సరూర్‌నగర్ స్టేడియం దాకా చేరుకుంటారని వెల్లడించారు. కొత్తగూడెం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హైదరాబాద్ సభకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోకుండా పేపర్ లీకేజీ ఘటనలకు తావిచ్చారని, బాధ్యతారహితంగా వ్యవహరించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని అన్నారు. ఈ సమావేశంలో సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపల్లి శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ .కరీం పాషా, obc జిల్లా సెక్రటరీ బాలు.భద్దర్ రావు, యువజన కాంగ్రెస్ నాయకులు తేజావత్ సాయి పాల్గొన్నారు.