మన్యంన్యూస్,ఇల్లందు..అనారోగ్యంతో మరణించిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లెందు పట్టణ కమిటీ సభ్యురాలు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కామ్రేడ్ దండు వెంకటమ్మ సంతాప సభ ఆదివారం ఇల్లెందు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో కూరపాటి పద్మ అధ్యక్షతన జరిగింది. ఈ సంతాప సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధానకార్యదర్శి కొక్కు సారంగపాణి మాట్లాడుతూ… కామ్రేడ్ వెంకటక్క పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన అనేక పోరాటాలలో చురుకైన పాత్ర పోషించిందని, మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడిందని అన్నారు. స్టేషన్ బస్తీలో ప్రభుత్వ భూములను ఆక్రమించి పేదలకు ఇండ్ల స్థలాలను పంచి ఇంటి నిర్మాణాలను చేపట్టిందని, కాలనీలో విద్య, వైద్యం, రహదారి, మంచినీటి సౌకర్యాల కొరకు కృషి చేసిందని తెలిపారు. తను నమ్మిన విప్లవ రాజకీయాల కొరకు ఎన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు, చీలికలు, నిర్బంధాలు ఎదురైనా న్యూడెమోక్రసీ పార్టీ వెనకాల పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి దృఢంగా నిలబడిందని పేర్కొన్నారు. ముందుగా కామ్రేడ్ వెంకటక్కను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఇల్లెందు ఏరియా కమిటీ అధ్యక్షులు డి. మోహన్ రావు, పివైఎల్ జిల్లా ప్రధానకార్యదర్శి పర్షిక రవి, నాయకులు కొక్కు ఉమారాణి, సంధ్య, హేమ, సరోజన, నజీమా, ద్వలి, లక్ష్మణ్,ఉబ్బనిలక్ష్మయ్య, చిట్టి, మమత తదితరులు పాల్గొన్నారు.
