మన్యం న్యూస్,ఇల్లందు..ఇల్లందు- మహబూబాద్ ప్రధాన రహదారిపై నిజాంపేట ప్రాంతంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటనను అటుగా వెళుతున్న ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్ గమనించి గాయాలైన వారిని స్వయంగా తన వాహనంలో ఎక్కించి ఇల్లెందు ప్రభుత్వ హాస్పటల్ కు తరలించి తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం చరవాణి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు చికిత్సలు చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగింది. క్షతగాత్రులను స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించడంతో తోటి వాహనదారులు హరిసింగ్ ను గొప్ప మానవతావాది, నిజమైన రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు.