మన్యం న్యూస్, ఇల్లందు:సీపీఐ ఏఐటియుసి ప్రజానాట్యమండలి సీనియర్ నాయకుడు బల్లాల మనోహర్ (75) అనారోగ్యంతో శనివారం రాత్రి 24 ఏరియాలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సీపీఐ ప్రజానాట్యమండలి గాయకుడు మనోహర్ మరణవార్త తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర సమితిసబ్యులు కె సారయ్య, సీపీఐ పార్టీశ్రేణులు ఆయన ఇంటికి చేరుకుని మనోహర్ పార్ధీవదేహంపై ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… మనోహర్ మృతి సిపిఐ పార్టీకి, ప్రజానాట్యమండలికి తీరని లోటని పేర్కొన్నారు. మనోహర్ పార్టీలొ, యూనియన్లొ కొనసాగుతూ ప్రజాకళలకు ప్రాణంపొసేవాడని, ప్రజానాట్యమండలిలో పాయం ముత్తయ్య, రాందాస్ లాంటి సీనియర్ కళాకారులతో అనేక నాటకాలు వేసి ప్రభుత్వ విధానాలను తన కళల ద్వారా ఎండగట్టేవాడని ప్రజలను ఉద్యమాల వైపు ఆకర్షితులను చేసేవాడని కొనియాడారు. మనోహర్ మంచి డోలకిస్ట్, మంచి గాయకుడు అని తన గానాల ద్వారా యువకులు ఆకర్షితులు అయ్యోవారని తెలిపారు. సింగరేణిలొ సైతం కల్చరల్ ఈవెంట్స్ లలొ హ్యూమర్ క్రిస్ట్, కమేడియన్ గా నవ్వించేవాడని కోలిండియాలొ సింగరేణి తరుపున పాల్గొని అనేక ప్రశంసలు అందుకున్నాడని వారు అన్నారు. మనోహర్ మృతి ప్రజాకళలకు తీరని లొటని ఆయన లేని లొటు ఎవరు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం మనోహర్ కుటుంబసబ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో సిపిఐ పట్టణ కార్యదర్శి బంధం నాగయ్య, మండల కార్యదర్శి ఉడత ఐలయ్య,23వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రవీందర్, డిహేచ్పిఎస్ రాష్ట్ర సమితి సబ్యులు చాట్ల గణపతి, సహయ కార్యదర్శి శంషుద్దిన్, సూర్య ప్రకాష్, ఆదినారాయణ, ఈర్ల రవి, బొప్పిశెట్టి సత్యనారాయణ, వడ్ల శ్రీనివాస్, బంటు యాదగిరి, మోజేస్, దూదురి లింగయ్య, బుచ్చి రాములు, ఎన్ఎఫ్ఐడబ్ల్యు నాయకులు కాకేటి జయ తదితరులు ఉన్నారు..