UPDATES  

 మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే మెచ్చా

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 07: మండల పరిదిలో ఆదివారం పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మెచ్చా పాల్గొన్నారు. గుంటిమడుగు గ్రామంలో ఆసీ నాగమణి, రామకృష్ణ (లేట్) దంపతుల కుమారుడు ప్రదీప్ వివాహ వేడుకలో పాల్గొనీ నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. గుంటిమడుగు గ్రామానికీ కోట్ల రూపాయలతో బిటి రోడ్డు మంజూరు చేయడంతో ఎమ్మెల్యేకి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. నందిపాడు గ్రామంలో టీచర్ కారం వీరాస్వామి, నాగావతి దంపతుల కుమారుడు మహేష్ కుమార్ వివాహ వేడుకలో పాల్గొనీ నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కొయరంగాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్థులతో కలిసి నృత్యం చేశారు. ఊట్లపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని గిరిజన భవన్ నందు జరిగిన కొలిపాక సుబ్బారావు దంపతుల కుమారుడు అరుణ్ గోపి వివాహ వేడుకలో పాల్గొనీ నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !