మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
పుట్టపాడు లో జరిగిన ఎన్కౌంటర్ అంతా బూటకమని పోలీసులు కావాలనే ఇద్దరిని చిత్రహింసలు పెట్టి ఇద్దరిని హతమార్చారని అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ సమితి కార్యదర్శి ఆజాద్ పేరిట ఆదివారం లేఖ విడుదల చేశారు.
పుట్టపాడు ఎన్కౌంటర్ బూటకం అని, నిరాయుధుడిని పట్టుకొని, చిత్రహింసలు పెట్టి పోలీసులు కాల్చి చంపారని లేఖలో పేర్కొన్నారు.
ఇది పోలీసుల పిరికిపంద చర్య అని, టిఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎస్పీ వినీత్, డీఎస్పీ సత్యనారాయణ సిఐ అశోక్ లు ఈ హత్యకు పూర్తి బాధ్యత వహించాలని లేఖలో వివరించారు.