తెలంగాణ యాదిలో ప్రజలు మరువని మన్యం బిడ్డ రేగా
రేగాపై ప్రతిపక్షాల ప్రభావం ఉండేనా..?
– ప్రతిపక్షాలకు నియోజకవర్గంలో బలమైన నాయకుడు కరువా..?
– రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు నల్లేరు మీద నడకేనా…?
– నియోజకవర్గంలో ప్రవహిస్తున్న నిధుల వరద…
– వినూత్న రీతిలో దూసుకుపోతున్న రేగా వర్గీయులు…
– సోషల్ మీడియా వేదికగా అస్త్రాలు సంధిస్తున్న రేగా…
– రానున్న ఎన్నికల్లో రేగా గెలుపు ఖాయమని సంకేతాలు..!
మన్యం న్యూస్, బూర్గంపాడు :
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో తనకంటూ ప్రత్యేకమైన మార్కును సంపాదించుకున్న రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్ గా, స్థానిక శాసనసభ్యులుగా పనిచేస్తూ ప్రజల మండలను పొందుతూ ఉన్నారు. పినపాక నియోజకవర్గంలో ప్రతి మండలానికి కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం నుండి రాబట్టి, పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తూ దూసుకుపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పినపాక నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో రేగా గెలుపు ఖాయం అంటూ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు. పినపాక నియోజకవర్గంలో సుమారు లక్షల 50 వేల ఓట్లు ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ధారించే బూర్గంపాడు మండలం కీలకమని అందరికీ తెలుసు. ఈ మండలంలో సుమారు 25 వేల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిపక్షాల పాత్ర అంతంత మాత్రంగానే ఉన్నదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో బలమైన నాయకుడు బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ టీపీ కి, బీఎస్పీకి, వామపక్షాలకు లేకపోవడంతో రేేేేగా కాంతారావు గెలుపుకి శుభ పరిణామంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో బిజెపి పార్టీ అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉన్నది కేవలం ప్రకటనలకు విమర్శలకు వేదికగా సోషల్ మీడియా ద్వారా మాత్రమే తన ఉనికిని చాటుకుంటూ ఉన్నాయిి. ఇక పోతే కాంగ్రెస్ పార్టీలో గల్లి నుండి ఢిల్లీ వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు విపరీతంగా బయట పడుతూనే ఉన్నాయి. ఇటీవల పినపాక నియోజకవర్గం లో ధనసరి సూర్య వర్సెస్ బట్టా విజయ గాంధీ అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, వాగ్వాదానికి దిగడం ఆ పార్టీకి తీరని లోటుగా కనిపిస్తూ ఉందని పలువురు విశ్లేషకులు పేర్కొంటూ ఉన్నారు. పార్టీలో ఉన్నవారు బలమైన నాయకులు ఎవరూ లేకపోవడంతో వారు అంతంతో మాత్రం గానే పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ టిపిి, బిఎస్పీ, వామపక్షాలలో ఈ ప్రాంతంలో బలమైన నాయకులు లేక ఆయా పార్టీల కేడర్లు సతమతమవుతున్నారు. ఆ పార్టీలకు నడిపించే సరైన నాయకుడు నాయకత్వం లేకపోవడంతో అధికార పార్టీ చేసే అభివృద్ధి పనులకు వారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయోమయంలో పడ్డారు.
– నియోజకవర్గంలో ప్రవహిస్తున్న నిధుల వరద…
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సీఎం కేసీఆర్ దగ్గర తనకు ఉన్న చనువుతో ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశగా సీఎంకు సమస్యలను నియోజకవర్గంలోని ప్రజల అవసరాలను పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ రేగా కాంతారావు ఈ పినపాక నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి, నియోజకవర్గంలో నిధుల వరద ప్రవహింప చేస్తున్నారని చెప్పవచ్చు. ఏఏ ప్రాంతాల్లో ఏఏ అత్యవసర పనులు ఉన్నాయో వాటిని వాటిని పునరుద్ధరిస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో చప్టాలు, చిన్నచిన్న బ్రిడ్జిలు, డ్రైనేజీ వ్యవస్థలు, ఆస్పత్రులు, ఆసుపత్రుల ఆధునీకరణ తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి శభాష్ రేగా కాంతారావు అని ప్రజలు అభినందించేలా కృషి చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు సారధ్యంలో నిధుల వరద రావడంతో ప్రతిపక్షాలకు నోరు మూతపడి, అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా రేగ కాంతారావు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు.
– సోషల్ మీడియా వేదికగా ప్రచార హోరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రచారాన్ని వినూత్న రీతిలో రేగా కాంతారావు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవలసిన పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడింది. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లో ఉంటూ అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తూ, అందుకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకుంటూ పినపాక నియోజకవర్గం అభివృద్ధిపదంలో నడిపిస్తున్నారని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యే రేగా కాంతారావు నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో ఏ వార్తలు చూసినా… ఏ ఛానల్లో చూసిన రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా చెమటలు పట్టిస్తూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ ఉన్నారని తెలుస్తుంది. వాటిని బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సోషల్ మీడియా ద్వారా పోస్టింగులు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. కేవలం జిల్లా అధ్యక్షుడిగా, శాసనసభ్యులుగా, ప్రభుత్వ విప్ ఉంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా రాష్ట్రస్థాయి నాయకులు తో సరి సమానంగా పార్టీ అభివృద్ధికి ప్రచారాన్ని నిర్వహిస్తూనే, ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ.. కేంద్ర ప్రభుత్వం సైతం విమర్శనాస్త్రాలను గుప్పించడంలో ముందంజలో ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు.
– రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు నల్లేరు మీద నడకే
పినపాక నియోజకవర్గం లో ప్రతిపక్షాలకు రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవాలంటే నల్లేరు మీద నడకే అని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాతగా రేగా కాంతారావు పేరును దక్కించుకున్నారు. ప్రతిపక్షాలు తాము ఏమి చేసామో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన వర్గీయులు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏ పార్టీలో చేరారు… ఏ పార్టీకి చేరుతారు… కొత్త పార్టీ పెడతారా.. ఆయనకు ఆయన వర్గీయులకు స్పష్టత లేకపోవడంతో అయోమయంలో వారు ఉన్నారని నిపుణులు వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పొంగులేటి ప్రభావం కొంతమేర ఉన్నా… మిగతా పార్టీలు అంతంత మాత్రంగా ఉండడంతో పినపాక నియోజకవర్గంలో కాని విని ఎరుగని రీతిలో నిధులు మంజూరు చేయించి ఎప్పటికప్పుడు ప్రజల్లో పర్యటిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రేగా కాంతారావు పనితీరుకు ఫిదా ప్రజలు అవుతున్నారు. రాబోయే రోజుల్లో రేగా కాంతారావు పినపాకలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీలు తాము ఏం చేశారు. ప్రజలకు ఏ విధంగా ఓట్లు అడగాలో వారికే అర్థం కాని పరిస్థితి పినపాక నియోజకవర్గంలో ఏర్పడింది.
– రానున్న ఎన్నికల్లో కీలకం కానున్న యువజన విభాగం
ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం సుమారు లక్షల 50 వేల ఓటర్లు పినపాక నియోజకవర్గంలో ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ సూచనల మేరకు అర్హత కలిగిన యువత ఓటరుగా దరఖాస్తు చేసుకొని కొత్తగా ఓటు హక్కును పొందారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఈ ప్రాంతంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతం కంటే ఈసారి యూత్ ఓటర్లు ఎక్కువగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో అనేకమంది యువత గులాబీ కండువాలను కప్పుకొని పార్టీలో చేరారు. అదేవిధంగా బిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ స్థాయిలో అన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ తలపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తూ, పార్టీ బలోపేతానికి ప్రత్యేక రీతిలో కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. సోషల్ మీడియా వేదికగా సైతం ప్రతిపక్షాలు వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ, పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో చూపిస్తున్న శ్రద్దను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నారు. ఇదే తరహాలో యువజన నాయకులు తమ పరిధిలోని ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళుతూ, ఆ సమస్యలను పరిష్కారం చేపిస్తూ ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకాన్నికి మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి యువజన నాయకులు తమ కార్యకర్తలను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ క్యాడర్ను చాప కింద నీరులా పెంచుకుంటూ పోతున్నారు. ఏది ఏమైనప్పటికి రాబోయే ఎన్నికలలో పినపాక నియోజకవర్గ అభివృద్ధి రేగా కాంతారావు గెలుపును సునాయాసం చేసిందని తెలుస్తుంది. రాబోయే కాలంలో రేగా కాంతారావు ఈ ప్రాంతానికి మరోసారి గులాబీ పార్టీ నుండి గెలిచి విజయభావట ఎగరవేయడం ఖాయమని ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది.