మన్యం న్యూస్,ఇల్లందు:టేకులపల్లి మండలానికి చెందిన ఎండి సబీర్- సుబేదాబేగం దంపతులు ఇల్లందు నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హజ్ యాత్రకు ఎన్నికైన సందర్భంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మహమ్మద్ షబీర్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి హాజీ, నబి, షకీల్, ఇలియాజ్, స్థానిక నాలుగవ వార్డ్ కౌన్సిలర్ ఆజామ్, ఇల్లందు బిఆర్ఎస్ పార్టీ మండల కో ఆప్షన్ సభ్యులు ఘాజి, ఇల్లందు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మసూద్ రబ్బు, బేతంపూడి దర్గా కమిటీ సభ్యులు, షబీర్ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.