UPDATES  

 గ్రామపంచాయతీ అభివృద్ధి కి నిధులు ఇవ్వండి -ప్రజావాణిలలో వినతి పత్రాలు అందజేసిన సర్పంచ్ నారం రాజశేఖర్

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 08: అశ్వరావుపేట మండలం, మల్లాయి గూడెం గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పడిన పంచాయితీలో రోడ్లు అంగన్వాడి పాఠశాల తోపాటు కొండతోగు గ్రామంలో గిరిజన ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అనుదీప్, భద్రాచలంలోని ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ ని వేరువేరుగా ప్రజావాణిలో కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మల్లాయిగూడెం గ్రామపంచాయితీ పరిది కొండతోగు గ్రామం నుండి అనంతరం వెళ్లే రోడ్డు బిటి రోడ్డు నిర్మించాలని అదేవిధంగా కొండ తోగువాగుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, గ్రామ పంచాయతీలోని తాటి నాగుల గుంపు కు బీటి రోడ్, మల్లాయిగూడెం నుండి జగన్నాధపురం రోడ్డు నిర్మాణానికి దిబ్బగూడెంలోని రైతుల పొలాలకు వెళ్లే రహదారి, పండు వారి గూడెం పాలవాగు రైతుల పొలాలకు వెళ్లే రహదారి నిర్మాణంతో పాటు తాటి నాగుల గుంపు లో అంగన్వాడి భవనం మంజూరు పండు వారి గూడెం కొండతోగు మల్లాయిగూడెం గ్రామాల్లో అంగన్వాడి భవనాలకు ప్రహరి గోడల నిర్మాణం కోసం మరమ్మత్తులు, పాఠశాల మరమ్మత్తులు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !