మన్యంన్యూస్,ఇల్లందు:భద్రాద్రి కొత్తగూడెం పిడిఎం జడ్జి రామారావు నుండి ఇల్లందు కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా దేవరపల్లి కీర్తి చంద్రికరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించినారు. ఈ సందర్భంగా ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిడి సత్యప్రకాష్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ భూక్య రవికుమార్ నాయక్, జనరల్ సెక్రటరీ సువర్ణపాక సత్యనారాయణ దొర, జాయింట్ సెక్రెటరీ కీర్తికార్తిక్, ట్రెజరర్ కె.ఉమామహేశ్వరరావు పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇల్లందు కోర్టు హాల్ నందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు జడ్జికి పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయ కార్యక్రమం అనంతరం మహిళా న్యాయవాదులు జడ్జిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు ఏపీపీలు రచిత, కుంట శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు.
