ఎమ్మెల్యే మెచ్చా చొరవతో అశ్వారావుపేట సిహెచ్సి లో మరో ఇద్దరు డాక్టర్ లు
కెమిలయిడ్స్ వారి సహకారంతో సిసి రోడ్డు నిర్మాణం
మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 08: ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని, మంత్రి హరీష్ రావుని కలిసి సమస్యల పరిస్కారం కోసం ప్రత్యేకంగా కోరడం అలాగే కలెక్టర్ సహకారం, డిసీహెచ్సి రవి బాబు సహకారంతో సీహెచ్సి రూపు రేఖలు మొత్తం మార్చేశారు. ఇప్పటికే సీహెచ్సిలో 24గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అంతే కాకుండా సోమవారం మళ్ళీ మరో ఇద్దరు డాక్టర్లు గైనకాలజిస్ట్, అనేస్టతిస్ట్ నియమితులైయ్యారు. ఆదేవిందంగా అశ్వారావుపేట కేమిలాయిడ్స్ తో మాట్లాడగా బిటి రోడ్డు నుంచి హాస్పటల్ భవనం వరుకు సిసి రోడ్డు నిర్మాణ చూపిస్తానని తెలియజేసి పనులు ప్రారంభించారు. ఆదేవిందంగా అశ్వారావుపేట లో మార్చరి ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రతిపాదనలు మంత్రికి, జిల్లా కలెక్టర్ కి అందజేసినట్లు త్వరలో కొత్త భవనం మంజూరు కానుందని ఎమ్మెల్యే మెచ్చా తెలిపారు.