మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశేట్టి ని చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ జిల్లా కలెక్టర్ దృష్టికి ఎన్నో సంవత్సరాలుగా చర్ల మండల ప్రజలు పోస్ట్ మార్టం రూం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలపగా, స్పందించిన కలెక్టర్ పోస్ట్ మార్టం రూం నిర్మాణం కోసం రూ. 20 లక్షల రూపాయల గ్రాంట్ రిలీజ్ చేస్తున్నాను అని తెలియచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు మాట్లాడుతూ చర్ల మండల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన జిల్లా కలెక్టర్ అనుదీప్ కు, చర్ల మండల ప్రజల సమస్యలు ఏదైనా తన దృష్టికి వచ్చిన వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషిచేస్తున్న జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర రావు కు చర్ల మండల ప్రజల తరుపున హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు.
