మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జూనియర్ పంచాయతి కార్యదర్శుల సేవలు క్రమబద్ధీకరించాలని సమ్మెలో పాల్గొన్న జూనియర్ పంచాయతి కార్యదర్శుల మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సమ్మె చేస్తున్న పంచాయతి కార్యదర్శులు విధుల్లో చేరాలని సోమవారం ప్రభుత్వం జారీ చేసిన
మార్గదర్శకాలు మేరకు 9వ తేది సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరే అంశంపై సోమవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతి కార్యదర్శులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు మే 9వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధులకు హాజరుకాకపోతే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని జూనియర్ పంచాయతి కార్యదర్శులు పరిగణనలోకి తీసుకుని విధుల్లో చేరాలని చెప్పారు. విధుల్లో చేరిన కార్యదర్శుల వివరాలపై నివేదిక అందచేయాలని డిపిఓను ఆదేశించారు.