మన్యంన్యూస్,ఇల్లందు..:నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ సరూర్ నగర్లో చేపట్టిన యువ సంఘర్షణసభకు పిసిసి, సీఎల్పీ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు భారీ కాన్వాయ్ తో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి మరియు పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఖమ్మం హైదరాబాద్ రహదారిలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు లను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంఘర్షణ సభకు వెళ్లిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణాల శ్రీనివాసరావు, పసిక తిరుమల్, మాజీ కౌన్సిలర్ ధరావత్ కృష్ణ, గార్ల మండల కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, ఇబ్రహీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కమల, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు ఆనంద్, సత్యనారాయణ, ఖాదర్ బాబు, రవి, ఖాసీం , సాయి , ఐయన్టీయూసీ సీనియర్ నాయకులు లక్ష్మణరావు, కృష్ణ, కిరణ్ ,సతీష్ ,శ్రీ రామ్, నరేష్, ప్రసన్నకుమార్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
