శ్రమశక్తి అవార్డ్ గ్రహీత రంగనాథ్ ను సన్మానించిన ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లారెడ్డి* l
మన్యం న్యూస్,ఇల్లందు..ఇల్లందు ఏరియా ఆసుపత్రి నందు శ్రమశక్తి అవార్డ్ గ్రహీత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్ రంగనాథ్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ…కార్మికుల సమస్యల పరిష్కారానికై ఎనలేని కృషి చేస్తున్న రంగనాథ్ కు శ్రమశక్తి అవార్డ్ లభించటం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులను పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మ్యాట్రిన్ సౌభాగ్యవేణి, ఏరియా ఆసుపత్రి పిట్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీలు జాఫర్, మహబూబ్, డాక్టర్లు శారదాదేవి, జగన్మోహన్ రావు, విక్రమ్, సిస్టర్లు గ్రేస్, అనిత, ఫార్మాసిస్ట్ సునీత, శ్రీను, వార్డ్ బాయ్స్ సలీం, చాంద్ పాషా, బదిలీ వర్కర్లు శ్వేత, ఉషా, కాంట్రాక్టు ఉద్యోగులు కోటయ్య, రాము, చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.