డ్రైనేజీ సమస్యల పరిష్కారం దిశగా రేగా అడుగులు
అభివృధి పనులను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 8
మణుగూరు పట్టణం లోని పైలెంట్ కాలనీ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి డ్రైనేజీ పూడిక తీత పనులను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,వివిధ కాలనీ లలో డ్రైనేజ్ వరద సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి,పరిష్కరించాలని సంబంధిత మున్సిపల్ అధికారులను వారు ఆదేశించారు.పట్టణం లోని అన్ని వార్డులలో పరిశుభ్రత, రానున్న వర్ష కాల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై, అధికారులకు పలు సూచనలు చేశారు.అభివృద్ధి పనులను మున్సిపాలిటీ అధికారులు నిరంతర ఫక్రియగా భావించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి లేదు అన్నారు. పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, ఉమామహేశ్వరరావు,ఏఈ నాగేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, సీనియర్ నాయకులు వట్టం. రాంబాబు,యాదగిరి గౌడ్,పార్టీ నాయకులు ఎడ్ల శ్రీను,తాత రమణ,లక్ష్మయ్య,గణేష్, యువజన నాయకులు, రవి ప్రసాద్ సృజన్ రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.