మన్యం న్యూస్,టేకులపల్లి:టేకులపల్లి మండలం సంపత్ నగర్ గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో దారుణ హత్యకు గురైన గోళ్ళ జానకీ రాములు(55) మృతదేహానికి మంగళవారం జెడ్పీ ఛైర్మెన్ కోరం కనకయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి హత్యకు సంబంధించిన కారణాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట నివాళులర్పించిన వారిలో మండల నాయకులు కోరం సురేందర్, ముచ్చా సుధాకర్, భూక్యా సర్దార్, రావూరి సతీష్ తదితరులు ఉన్నారు.